2000 రూపాయల నోటు పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..!!

గత కొద్ది సంవత్సరాల నుండి 2000 నోటు మనుగడలో కనబడటం లేదని చాలామంది సెలబ్రిటీలు( Celebrities ) పలు ఇంటర్వ్యూలలో తెలియజేయడం జరిగింది.ఇదే సమయంలో బయట మార్కెట్ లో కూడా 2000 నోటు కనబడటం లేదని చాలామంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు.

 Central Government's Key Announcement On 2000 Rupees Note , Rbi, Nirmala Sithara-TeluguStop.com

దీంతో 2000 నోటు కేంద్రం రద్దు చేసిందన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి.అయితే వాటిలో వాస్తవం లేదని కేంద్ర పెద్దలు కొట్టి పారేయడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉంటే ఏటీఎంలలో ( ATMs )2000 నోట్లు ఉంచడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్( Finance Minister Nirmala Sitharaman ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఏటీఎంలో 2000 నోట్లు ఉంచడం అనేది పూర్తిగా బ్యాంకుల ఇష్టమని స్పష్టం చేశారు.నోట్లు ఉంచొద్దని కేంద్రం నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదని పేర్కొన్నారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం గత ఏడాది మార్చి నాటికి ₹500, ₹2000 నోట్ల మొత్తం విలువ ₹27, 057 లక్షల కోట్లు అనీ పేర్కొన్నారు.

తమ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు ఏటీఎంలో నోట్లు నింపుతాయని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube