ఏపీలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు వేడెక్కుతున్నాయి.ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఏపీ దద్దరిల్లుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని , ఆయనను అరెస్టు చేసిన విధానం సరిగా లేదని టిడిపి ఆరోపిస్తూ వైసిపి ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తోంది.
ఇక హైకోర్టులోను చంద్రబాబు బెయిల్ దరఖాస్తు చేసుకున్నా, ఈనెల 19కి వాయిదా పడింది.ఇప్పట్లో చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ఇక దేశవ్యాప్తంగా అనేకమంది చంద్రబాబు అరెస్టు విధానాన్ని తప్పుపడుతూ స్పందిస్తున్నారు.దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతు పొందే విధంగా చంద్రబాబు అరెస్టు విధానం పై స్పందించే విధంగా టిడిపి అనేక ప్రయత్నాలు చేస్తోంది.
చంద్రబాబు ( Chandrababu )అరెస్టుతో సెంటిమెంటును రగిల్చి, వచ్చే ఎన్నికల్లో విజయం సొంతం చేసుకోవాలనే ఆలోచనతో టిడిపి ఉంది.ఇక చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఎన్డీఏ కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే సానుకూలంగా స్పందించారు .చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి( Daggubati Purandeswari ) స్పందించి చంద్రబాబు అరెస్టును ఖండించారు.కానీ ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు.
టిడిపి నిర్వహించిన బంద్ కు బిజెపి మద్దతు లేదని ఆమె ప్రకటించారు.ఒకరిద్దరూ నేతలు మినహా, బీజేపీ నుంచి ఎవరు చంద్రబాబు( Chandrababu ) అరెస్టుపై స్పందించడం లేదు.
ఈ నేపథ్యంలో టిడిపి సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు బిజెపి పెద్దలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్ట్ లో ఢిల్లీ పెద్దల పాత్ర కూడా ఉన్నందుకే మాట్లాడడం లేదా అని ప్రశ్నించారు.చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై కేంద్ర పేదలు ఎందుకు మౌనం పాటిస్తున్నారని, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారి పనిచేస్తున్నా, ఎందుకు స్పందించడం లేదని అయ్యన్న నిలదీశారు. మోది జీ 20 సదస్సులు పెట్టి ఉపయోగం ఏంటి అని ఆయన ప్రశ్నించారు .ఏపీలో ఏం జరుగుతోంది అనేది మీరు పట్టించుకోరా అంటూ ఆయన ప్రశ్నించారు.కేంద్ర బిజెపి పెద్దల సహకారంతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని, లేకపోతే జగన్ అంతటి సాహసానికి ఒడిగట్టరనే అనుమానం టిడిపిలో కలుగుతుంది.
ఇప్పటికే బిజెపితో పొత్తు కోసం టిడిపి ప్రయత్నించి విఫలమైంది.వచ్చే ఎన్నికల్లో టిడిపి ,బిజెపి, జనసేన కూటమిగా వెళ్లి వైసిపిని ఎదుర్కోవాలనే ప్రతిపాదనను టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) కేంద్ర బిజెపి పెద్దల వద్ద ప్రస్తావించిన వారి నుంచి సానుకూల స్పందన రాలేదు.
దీంతో ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కేంద్రం పాత్ర పై టీడీపీ అనుమానంతో ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy