తమిళ స్టార్ హీరో విశాల్ గురించి మనందరికీ తెలిసిందే.గత కొద్దిరోజులుగా విశాల్ పేరు సోషల్ మీడియాలో మారు మోగుతోంది.
తరచూ ఏదోక విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తున్నారు విశాల్.ఇది ఇలా ఉంటే హీరో విశాల్( Vishal ) తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోని( Mark Antony )ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ గా నటించారు.
ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది.ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు విశాల్.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేశారు.

ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా పలు కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆ వివరాల్లోకి వెళితే.అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు.సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో విశాల్ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
విశాల్ హీరోగా నటించిన చిత్రం తుప్పరివాలన్.ఈ సినిమా ఈ సినిమా 2017లో విడుదల అయ్యింది.ఈ మూవీని దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించారు.తెలుగులోనూ ఈ చిత్రాన్ని డిటెక్టివ్ పేరుతో విడుదల చేసారు.ఈ సినిమా గురించి ఇంటర్వ్యూలో విశాల్ మాట్లాడుతూ.

మిస్కిన్‌తో మరోసారి సినిమా చేయడం జరగని పని.తుప్పరివాలన్ -2( Thupparivaalan 2 ) విషయంలో నన్ను చాలా ఇబ్బందులకు గురిచేశాడు.లండన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఒంటరిగా కూర్చుని బాధపడ్డాను.
ఆ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను.నా ప్లేస్‌లో ఇంకెవరైనా ఉండుంటే కచ్చితంగా గుండెపోటుతో చనిపోయేవారు.
నేను కాబట్టి ఆ నష్టాన్ని తట్టుకున్నాను.ఒకవేళ మిస్కిన్‌తో తుప్పరివాలన్ 2 షూట్ చేసినా అది పూర్తి కాదని తెలుసు.
అందుకే ఆ మూవీని ఆపేశాను.వచ్చే ఏడాదిలో స్వయంగా నేనే తెరకెక్కించాలనుకుంటున్నాను.
ఆ ప్రాజెక్ట్ నాకు బిడ్డ లాంటిది అంటూ ఆ డైరెక్టర్ పై ఒకింత అసహనం వ్యక్తం చేశారు.అంతే కాకుండా ఆ డైరెక్టర్ తో నేను చచ్చినా పని చేయను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు విశాల్.







