ఢిల్లీలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ డ్రాగ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
కేసులో 11 మందిపై చర్యలకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
వీరిలో డీసీపీ స్థాయి అధికారితో సహా మరో పది మందిని సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
అయితే, నూతన సంవత్సరం రోజున జరిగిన కారు ప్రమాదం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
అంజలి స్కూటీని కారు ఢీకొట్టింది.అనంతరం స్కూటీతో సహా యువతిని ఈడ్చుకెళ్లి ఆమె మృతికి కారణమైయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.







