దేవర విషయంలో సెలబ్రిటీల మౌనానికి కారణమేంటి.. చూసినా సైలెన్స్ ఎందుకంటూ?

దేవర సినిమా( Devara Movie ) విడుదలై 4 రోజులైంది.మొదటి మూడు రోజులు ఈ సినిమాకు టికెట్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.

కొన్ని థియేటర్లలో ఈ సినిమాకు సంబంధించి రికార్డ్ స్థాయిలో షోలు ప్రదర్శితమయ్యాయి.ఈ సినిమాకు ఇప్పటికే 304 కోట్ల రూపాయలు కలెక్షన్ల రూపంలో వచ్చాయి.

ఫుల్ రన్ లో ఈ సినిమా సులువుగా 600 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను అందుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.నైజాంలో ఈరోజు కూడా ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం నెమ్మదిగా కలెక్షన్లు పుంజుకుంటూ ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు.బాలీవుడ్ స్ట్రెయిట్ హీరోల సినిమాలకు సమానంగా ఈ సినిమా అక్కడ థియేటర్లలో విడుదల కావడం కొసమెరుపు.

Advertisement

అయితే సెలబ్రిటీలు( Celebrities ) మాత్రం దేవర సినిమా విషయంలో మౌనంగా ఉండటం గమనార్హం.

వాస్తవానికి దర్శకుడు కొరటాల శివకు( Director Koratala Siva ) సైతం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన కొరటాల శివ రాబోయే రోజుల్లో మరి కొందరు స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించనున్నారు.రాజమౌళి( Rajamouli ) సైతం ఇప్పటికే థియేటర్లలో దేవర సినిమాను చూశారు.

అయితే సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు పెట్టలేదు.

ఇతర రాష్ట్రాలకు చెందిన సెలబ్రిటీలు దేవర సినిమా గురించి రియాక్ట్ అవుతున్న తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మాత్రం సైలెంట్ గా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.ఎన్టీఆర్( NTR ) సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా చేయడం ఎంతవరకు రైట్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.దేవర బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ రన్ లో సులువుగానే 100 కోట్ల రూపాయల మార్క్ ను అందుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

22 ఏళ్లుగా పాక్‌లో నరకయాతన.. ఒక్క యూట్యూబ్ వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది..?
మంచి మనసు చాటుకున్న శర్వానంద్... కూతురి పేరుతో అలాంటి సేవ!

దేవర సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు