కరోనా విషయంలో అమెరికాను హెచ్చరిస్తున్న సీడీసీ.. నాలుగో వేవ్​ తప్పదా.. ? 

మనుషుల మనస్తత్వాలను గుర్తించడం ఎంత కష్టమో, ప్రస్తుతం కరోనాలో వస్తున్న మార్పులు కూడా కనిపెట్టడం అంతే కష్టంగా రోజు రోజుకు మారుతున్నాయట.

అందువల్ల ప్రజలకు ముప్పు ఎలా పొంచి ఉందో ఊహించడం అంత సులువైన పనికాదట.

ఇప్పటికే రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి పై ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో, కరోనా వైరస్ జన్యు మార్పుల వల్ల అమెరికాకు నాలుగో వేవ్ ముప్పు పొంచి ఉందని అమెరికా సీడీసీ చీఫ్ డాక్టర్ రోచెల్లీ వాలెన్ స్కీ హెచ్చరించడం మరింత భయాన్ని కలిగిస్తుందట.ఎందుకంటే మనదేశంలో పుట్టే వ్యాధుల కంటే, విదేశీ వ్యాధుల్లో ఉన్న నాణ్యత వల్ల ప్రజలకు ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని కరోనా నిరూపించింది కదా.అదీగాక ఇండియాకి డబ్బులు తీసుకురారు కానీ రోగాలను మాత్రం వెంటబెట్టుకొచ్చి ఇక్కడి ప్రజలకు అంటించడం కామన్‌గా మారిపోయింది.ఇకపోతే అమెరికాలో ఉన్న వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం కొత్తగా వస్తున్న కరోనా వేరియంట్ల తో పెను ప్రమాదం పొంచి ఉందని, గత వారం అమెరికాలో రోజూ సగటున 70 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడిస్తుంది.

అదీగాక సగటున రోజూ 2 వేల మంది దాకా చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తుంది.కాగా బ్రిటన్ వేరియంట్ అయిన బీ.1.1.7తోనే అమెరికాలో ఎక్కువ కేసులు వస్తున్నాయని వీరు పేర్కొంటున్నారు.

Advertisement
పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!

తాజా వార్తలు