మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలోనే పలువురికి అధికారులు నోటీసులు అందించారు.
విచారణలో భాగంగా వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారని తెలుస్తోంది.ఈ మేరకు ఈనెల 12న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే ఈ కేసులోనే ఇటీవలే కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే.