వైఎస్ భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలోనే పలువురికి అధికారులు నోటీసులు అందించారు.విచారణలో భాగంగా వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారని తెలుస్తోంది.

ఈ మేరకు ఈనెల 12న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.అయితే ఈ కేసులోనే ఇటీవలే కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే.