నకిలీ ఐపీఎస్ కేసులో మరో నలుగురికి సీబీఐ నోటీసులు

నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీనివాస్ కేసులో మరో నలుగురికి సీబీఐ నోటీసులు అందజేసింది.ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన నలుగురు వ్యాపార వేత్తలకు నోటీసులు జారీ చేసింది.

 Cbi Notices Four More In Fake Ips Case-TeluguStop.com

ఈ మేరకు రేపు సీబీఐ ఎదుట విచారణ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.యూసుఫ్ గూడకు చెందిన వ్యాపారవేత్త మేలపాటి చెంచు నాయుడుకు నోటీసులు అందజేశారు అధికారులు.

సీబీఐ కేసుకు సంబంధించి సెటిల్ మెంట్ చేస్తానని శ్రీనివాస్ చెప్పినట్టు సమాచారం.అదేవిధంగా మరో వ్యాపారవేత్త వెంకటేశ్వర రావు కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చాడు.

ఢిల్లీలో పగటి సమయంలో లారీలు తిరిగేందుకు అనుమతిని ఇప్పిస్తానంటూ సనత్ నగర్ కు చెందిన రవి వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడని అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో పలువురిని సీబీఐ అధికారులు నోటీసులు అందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube