నకిలీ ఐపీఎస్ కేసులో మరో నలుగురికి సీబీఐ నోటీసులు

నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీనివాస్ కేసులో మరో నలుగురికి సీబీఐ నోటీసులు అందజేసింది.

ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన నలుగురు వ్యాపార వేత్తలకు నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు రేపు సీబీఐ ఎదుట విచారణ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.యూసుఫ్ గూడకు చెందిన వ్యాపారవేత్త మేలపాటి చెంచు నాయుడుకు నోటీసులు అందజేశారు అధికారులు.

సీబీఐ కేసుకు సంబంధించి సెటిల్ మెంట్ చేస్తానని శ్రీనివాస్ చెప్పినట్టు సమాచారం.అదేవిధంగా మరో వ్యాపారవేత్త వెంకటేశ్వర రావు కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చాడు.

ఢిల్లీలో పగటి సమయంలో లారీలు తిరిగేందుకు అనుమతిని ఇప్పిస్తానంటూ సనత్ నగర్ కు చెందిన రవి వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో పలువురిని సీబీఐ అధికారులు నోటీసులు అందించారు.

వాకింగ్ వ‌ల్ల గ‌ర్భిణీలు ఎలాంటి లాభాలు పొందుతారు.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఎంత సేపు వాకింగ్ చేయొచ్చు?