పిల్లి వర్సెస్ వేణు ! జగన్ రంగంలోకి దిగినా అదే లొల్లి

ఏపీ అధికార పార్టీ వైసీపీలో( YCP ) ఇద్దరు సీనియర్ నేతల మధ్య చోటు చేసుకున్న వివాదం ఆ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.స్వయంగా ఈ వ్యవహారంలో వైసీపీ అధినేత సీఎం జగన్ జోక్యం చేసుకున్నా.

 Pilli Vs. Venu! Even If Jagan Entered The Field, The Same Lolli, Jagan, Ysrcp, A-TeluguStop.com

పరిస్థితుల్లో మార్పు రావడం లేదు.అటు పిల్లి ఇటు మంత్రి వేణు( Minister Venu ) ఇద్దరు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తూ,  ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శించుకుంటున్నారు.

ఈ పరిణామాలతో రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ గందరగోళానికి గురవుతోంది.అసలు ఈ తతంగం  జరగడానికి కారణం, ఈ నియోజకవర్గ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే విషయంపైనే.

ఒకప్పుడు గురు శిష్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇప్పుడు ఒకరిపై ఒకరు మాటల తూటాలు వదులుకోవడానికి కారణాలు ఉన్నాయి.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Pillisubhsh, Ysrcp-Politics

2019 ఎన్నికల్లో రామచంద్రపురం( Ramachandrapuram ) నుంచి వేణు గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు.అయితే ఇది వేణు సొంత నియోజకవర్గం కాకపోవడంతో, వచ్చే ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని పిల్లి సుభాష్ చంద్రబోస్( pilli Subhash Chandra Bose ) చెబుతున్నారు.వచ్చే ఎన్నికల్లో తాను గాని, తన కుమారుడు తప్ప వేరొకరికి ఇక్కడ స్థానం లేదంటూ ఆయన చేసిన ప్రకటనలు వేణు వర్గంలో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.ఈ సీటు వ్యవహారం జగన్ వరకు వెళ్ళింది.

ఈ విషయంలో తొందరపడవద్దని జగన్ పిలిచి మాట్లాడినా,  సుభాష్ చంద్రబోస్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ఈ సీటు విషయంలో తాను ఎవరిని లెక్క చేసేది లేదని అవసరం అయితే రాజీనామా కూడా చేస్తానంటూ పిల్లి సుభాష్ చంద్రబోస్ హెచ్చరికలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఇద్దరు నేతలు మధ్య పోరు  కేసుల వరకు వెళ్ళింది.తన కార్యకర్తలపై మంత్రి వేణు తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని సుభాష్ చంద్రబోస్ ఆరోపిస్తున్నారు.

ఇక రామచంద్రపురం నియోజకవర్గంలో వైసిపి గతంలో పోలిస్తే మరింతగా బలపడడమే సుభాష్ చంద్రబోస్ ఆరోపణలకు కారణమని మంత్రి వేణు చెబుతున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Pillisubhsh, Ysrcp-Politics

ఎంపీ మిథున్ రెడ్డి( MP Mithun Reddy ) , తోట త్రిమూర్తులు సమక్షంలోనే 2024లో తానే పోటీ చేయనున్నట్లు సీఎం జగన్ చెప్పారని వేణు గుర్తు చేస్తున్నారు.కోనసీమ జిల్లాలో కీలకంగా ఉన్న రామచంద్రపురం నియోజకవర్గంలో పరిస్థితి ఈ విధంగా మారడంతో, ఏ ఒక్కరిని పార్టీకి దూరం కాకుండా చూసుకుని వేణు సుభాష్ చంద్రబోస్ లను బుజ్జగించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు.ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube