విరుద్ధమైన జంతువులు జాబితా చూసుకుంటే అందులో ముందు వరుసలో ఉంటాయి కోళ్లు, పిల్లులు. ఎందుకంటే ఈ జాతులు పరస్పరం కలుసుకుంటే గొడవ పడతాయి.
అందులో దాదాపుగా పిల్లే నెగ్గుతుంది.అంతే కాదండోయ్… కోడి పిల్లలు( Chickens ) ఆరు బయట కనిపించాయంటే పిల్లులు, కుక్కలు వంటి జాతులు లొట్టలేసుకుని మరీ తినేస్తూ ఉంటాయి.
అందుకే వాటికి దూరంగా కోళ్లను పెంచుతారు మనుషులు.అయితే అలాంటి విజాతి జాతుల మధ్య స్నేహం కుదిరితే ఎలాగుంటుంది? వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజం.

ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో ఒకటి వైరల్ కాగా నెటిజన్లు కళ్లప్పగించి మరీ ఆ వీడియోని చూస్తున్నారు.ఇక్కడ వీడియోలో చిన్న పిల్లి పిల్ల, కోడి పిల్లలతో ఆడుకుంటున్న తీరుని చూసి ఆ కోడి పిల్లల తల్లి కోడి( Hen ) చాలా ఆశ్చర్యానికి లోనవుతూ చూస్తూ ఉండి పోయింది.అదే దృశ్యాన్ని అక్కడ వున్న ఆ ఇంటి ఓనర్ తన మొబైల్ కెమెరాలో బంధించి ఆ వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.ఈ వీడియో ఆ ఇంటి యజమానినే కాదు.
సోషల్ మీడియాలో వీడియో చూసిన వారిని కూడా విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తోంది అంతే మీరు నమ్మితీరాల్సిందే.కావాలంటే ఇక్కడ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

ఇంతకీ ఇందులో అంత నమ్మశక్యం కానంతగా ఏముంది అని అనుకుంటున్నారా ? అయితే ఆ వీడియో విషయానికొస్తే ఒక పిల్లి పిల్ల( Cat ) కోడి పిల్లలను తన అక్కున చేర్చుకుని తన కన్న పిల్లల్లా, అంతే తల్లి కోడిలగే వాటిని చూసుకోవడం ఇక్కడ మనం చూడవచ్చు.ఇక ఆ కోడి పిల్లలు కూడా పిల్లి పిల్ల దగ్గర అచ్చం తమ తల్లి దగ్గర కూర్చున్నంత కంఫర్టుగా ఉండడం గమనార్హం.ఇక ఆ దృశ్యం చూసిన తల్లి కోడి ఇదేందయ్యో ఇది.నేనెక్కడా చూడలేదన్నట్టుగా ఆ పిల్లి పిల్ల ముఖంలో ముఖం పెట్టి మరీ చూడటం మనం ఇక్కడ చూడొచ్చు.







