ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కులాల బందులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: బిఆర్ఎస్ ప్రభుత్వం( Brs GOVT ) వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కులాల బంధు పేరును తెరమీదకి తీసుకురావడం జరిగిందని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య( Dommati Narasiah ) శుక్రవారం అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు దళిత బంధు పేరిట పది లక్షల రూపాయలు కొంతమందికే ఇచ్చి మిగతా వారికి మొండి చేయి చూపడం జరిగిందన్నారు.

తదనంతరం బీసీ బంద్ పేరిట లక్ష రూపాయలు ఇస్తామని గ్రామానికి ఒక్కరికే పరిమితం చేయడం జరిగిందన్నారు.ఇది ఇలా ఉండగానే మైనార్టీ బందు పేరిట వారికి కూడా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తామని తెరమీదకి తీసుకురావడం జరిగింది.

ప్రజలకు ఆదుకుంటే మంచిదే కానీ ఊరికి ఒక్కరికి ఇద్దరికీ ఇచ్చి మిగతా వారిని నిరాశ పరచడం ఎంతవరకు సమంజసం అన్నారు.ఒక కులానికి బందు పేరిట డబ్బులు ఇస్తున్నట్లయితే కనీసం ఆ గ్రామంలో ఒక కులంలో 25 శాతం అన్న ఇస్తే బాగుంటుందన్నారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరి ఇద్దరికి ఇచ్చి మిగతావారు ఇదే ఆశతో ఓట్లు వేస్తారని పొరపాటు పడుతున్నారు.కానీ ఒక కులంలో నలుగురికి ఇచ్చి మిగతా వారికి ఇవ్వకపోగా అసంతృప్తితో వారు మీకు వ్యతిరేకంగా ఓటు వేసి మీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమన్నారు.

Advertisement

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాటి రామ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు పాల్గొన్నారు.

ఉర్సు ఉత్సవాలకు రండి -కేటీఆర్ కు ఆహ్వాన పత్రం
Advertisement

Latest Rajanna Sircilla News