చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనలో పలువురు టీడీపీ నేతలపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.టీడీపీ నేత నారా లోకేశ్ సహా సీనియర్ నాయకులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
పోలీసులు సిద్ధం చేసిన ఎఫ్ఐఆర్ లో లోకేశ్, అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నానితో పాటు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పేర్లు ఉన్నాయని తెలుస్తోంది.కాగా ఐపీసీ సెక్షన్లు 353, 290, 188, 341 సెక్షన్ల కింద టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి.
యువగళం పాదయాత్రలో నిబంధనలు ఉల్లంఘించారని, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు.అయితే, నిన్న బంగారుపాళ్యంలో లోకేశ్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.
దాంతో పాటు యువగళం వాహనాలను అడ్డుకునే క్రమంలో పోలీసులకు, టీడీపీ నేతలను తోపులాట జరిగిన విషయం తెలిసిందే.