క్రీడారంగంలో క్రికెట్( Cricket ) కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.క్రికెటర్ల జీవితం చాలా లగ్జరీగా ఉంటుంది.
ఈ విషయం అందరికీ తెలిసిందే.ఒక్కసారి క్రికెటర్ అయితే ఆర్థికపరంగా సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
అయితే కొంతమంది క్రికెటర్లు జీవితాలలో పడ్డ కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు.ఆ స్థాయికి రావడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు.
ఈ కోవకు చెందిన ఒక క్రికెటర్ గురించి తెలుసుకుందాం.
నాథన్ ఎల్లిస్( Nathan Ellis ) అంటే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అని అందరికీ తెలిసిందే.2018 లో హోబర్ట్ తరఫున తొలిసారి దేశవాళి క్రికెట్లో అడుగుపెట్టి.2021లో బంగ్లాదేశ్ సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.మొదటి మ్యాచ్ లో హ్యాట్రిక్ వికెట్లు తీసి రికార్డుల ఖాతా తెరిచాడు.ఇక ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాదు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని( Virat Kohli ) రెండుసార్లు అవుట్ అందరి దృష్టిలో పడ్డాడు.

నాథన్ ఎల్లిస్ ఈ ఐపీఎల్ సీజన్లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఇటీవలే రాజస్థాన్- పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో అద్భుత ఆటను ప్రదర్శించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు.పంజాబ్ జట్టులో కీలక బౌలర్గా అందరి ప్రశంసలు పొందాడు.

ఇతని వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే.జీవితంలో ఎన్నో కష్టాలు ఈయన జీవితాన్ని వెంటాడాయి.రాజస్థాన్ తో మ్యాచ్ అనంతరం స్వయంగా తానే తన జీవితంలోని కష్టాలను పంచుకున్నాడు.క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు చాలా చిన్నచిన్న ఉద్యోగాలు చేసేవాడట.సేల్స్ మెన్ గా ప్రతి ఇంటికి తిరిగేవాడట.ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ లో కూడా డైలీ లేబర్గా వెళ్లేవాడట.
ఒకవైపు క్రికెట్లో నైపుణ్యం పొందుతూ.మరొకవైపు చిన్నచిన్న ఉద్యోగాలు చేసేవాడు.
కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు, పొట్టకూటి కోసం ఎన్నో కూలీ పనులు చేశానని అలా ఎమోషనల్ అయ్యాడు.ప్రస్తుతం క్రికెట్లో రాణిస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.