తొలి మ్యాచ్ లోనే సరికొత్త రికార్డు సృష్టించిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా..!

భారత్- ఐర్లాండ్( Ireland ) మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ తొలి మ్యాచ్ లో భారత జట్టు తరఫున రీఎంట్రీ ఇచ్చి తొలి ఓవర్ లో కేవలం నాలుగు పరుగులు ఇచ్చి ఏకంగా రెండు వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా( Jasprit Bumrah ) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.తాను కెప్టెన్ గా సారథ్యం వహించిన తొలి టీ20 మ్యాచ్ లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న తొలి భారత క్రికెటర్ గా బుమ్రా నిలిచాడు.

 Captain Jasprit Bumrah Created A New Record In The First Match..! , Ireland ,-TeluguStop.com

తొలి మ్యాచ్ లో వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ సీరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 140 పరుగుల లక్ష్యాన్ని భారత్( India ) కు సవాల్ విసిరింది.భారత జట్టు 6.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది.అనంతరం వర్షం కారణంగా మ్యాచును సగంలోనే ఆపేయాల్సి వచ్చింది.

ఎంతసేపు ఎదురు చూసినా వర్షం ఆగకపోవడంతో భారత్ ను విజేతగా ప్రకటించారు.

భారత జట్టులోకి దాదాపుగా 11 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ చేయని సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ మ్యాచ్ తొలి ఓవర్ బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీశాడు.తో తాను సారథ్యం వహించిన తొలి టీ20 మ్యాచ్ లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న తొలి క్రికెటర్ గా నిలిచాడు.

సెప్టెంబర్ 2022లో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్ లో జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా క్రికెట్ కు దూరమయ్యాడు.ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్, ఐపీఎల్, WTC ఫైనల్ లో కూడా ఆడలేదు.11 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చి నాలుగు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube