తొలి మ్యాచ్ లోనే సరికొత్త రికార్డు సృష్టించిన కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా..!

భారత్- ఐర్లాండ్( Ireland ) మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ తొలి మ్యాచ్ లో భారత జట్టు తరఫున రీఎంట్రీ ఇచ్చి తొలి ఓవర్ లో కేవలం నాలుగు పరుగులు ఇచ్చి ఏకంగా రెండు వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా( Jasprit Bumrah ) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

తాను కెప్టెన్ గా సారథ్యం వహించిన తొలి టీ20 మ్యాచ్ లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న తొలి భారత క్రికెటర్ గా బుమ్రా నిలిచాడు.

తొలి మ్యాచ్ లో వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం భారత్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ సీరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. """/" / ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 140 పరుగుల లక్ష్యాన్ని భారత్( India ) కు సవాల్ విసిరింది.

భారత జట్టు 6.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది.

అనంతరం వర్షం కారణంగా మ్యాచును సగంలోనే ఆపేయాల్సి వచ్చింది.ఎంతసేపు ఎదురు చూసినా వర్షం ఆగకపోవడంతో భారత్ ను విజేతగా ప్రకటించారు.

"""/" / భారత జట్టులోకి దాదాపుగా 11 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ చేయని సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్ తొలి ఓవర్ బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీశాడు.

తో తాను సారథ్యం వహించిన తొలి టీ20 మ్యాచ్ లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న తొలి క్రికెటర్ గా నిలిచాడు.

సెప్టెంబర్ 2022లో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్ లో జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా క్రికెట్ కు దూరమయ్యాడు.

ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్, ఐపీఎల్, WTC ఫైనల్ లో కూడా ఆడలేదు.

11 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చి నాలుగు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

తక్కువ బరువుతో స‌త‌మ‌తం అవుతున్నారా.. అయితే మీ డైట్ లో ఇది ఉండాల్సిందే!