తిరుపతి ఉప ఎన్నికలకు నేడు నామినేషన్లు వేయబోతున్న ఆ పార్టీల అభ్యర్థులు..!!

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఉప ఎన్నికలు రావడం మనకందరికీ తెలిసిందే.

ఉప ఎన్నికలలో ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం జరిగింది.

వైసీపీ పార్టీ తరపున అభ్యర్థిగా గురుమూర్తి, బిజెపి జనసేన కూటమి నుండి మాజీ సీఎస్ రత్నప్రభ, టీడీపీ పార్టీ నుండి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నుండి చింతామోహన్ అభ్యర్థులుగా పోటీకి దిగుతున్నారు.ఇలాంటి తరుణంలో నేడు వైసీపీ పార్టీ అభ్యర్థి గురుమూర్తి, బిజెపి జనసేన కూటమి అభ్యర్థి రత్నప్రభ నేడు నామినేషన్లు వేయనున్నారు.

ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయినా నెల్లూరు జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు.ఈక్రమంలో అధికారపార్టీ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తో ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, కన్నబాబు, బాలినేని, అనిల్‌కుమార్‌, గౌతమ్‌రెడ్డి, నారాయణస్వామి హాజరు కానున్నట్లు సమాచారం.

అధికార పార్టీ ఎలాగైనా ఈ ఉప ఎన్నికలలో భారీ మెజార్టీ సాధించి ఏపీలో వైసీపీకి తిరుగు లేదని నిరూపించాలని ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.మరోపక్క విపక్ష పార్టీలు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని ఈ ఉప ఎన్నికలలో రుజువు చేయాలని ఆలోచన చేస్తున్నాయి.

Advertisement
పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 

తాజా వార్తలు