మేనిఫెస్టోలో ఇచ్చిన 80 శాతం హామీలను నెరవేర్చామని ఏపీ సీఎం జగన్ తెలిపారు.నాలుగేళ్ల రాజకీయ వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకొచ్చామన్నారు.
అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.
ఎక్కడా అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.రూ.1,97,473 కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు.ఇంటింటికి వెళ్లి జరిగిన మంచిని వివరిస్తున్నామన్నారు.ప్రజలను విభజించే జన్మభూమి కమిటీలను రద్దు చేశామని తెలిపారు.రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్లు 51 నుంచి 76కు పెంచామని చెప్పారు.15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.







