ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియా వైడ్ గా తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు మరో స్టార్ హీరో సిద్ధం అవుతున్నాడు.ఆయన మరెవరో కాదు.
న్యాచురల్ స్టార్ నాని( Nani ).ఇప్పటి వరకు ఎన్నో క్లాస్ సినిమాలను నటించి మెప్పించిన నాని ఇప్పుడు కొత్తగా మాస్ లోకి దిగాడు.శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”దసరా”.
కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ రేస్ లో బరిలో దిగబోతుంది.ఈ సినిమాపై నాని చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.అందుకే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎక్కడైనా సరే పక్కా హిట్ అంటూ కామెంట్స్ చేస్తూ ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతూ వస్తున్నాడు.
ఇక రిలీజ్ దగ్గర పడే కొద్దీ మరింత ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నాడు.

నిన్ననే ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ అవ్వగా మాసివ్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసారు.మార్చి 30న ఎట్లైతే గట్లయ్యే సూస్కుందాం.
అంటూ పోస్ట్ చేసారు.అన్ని మెసేజెస్ ను చదివా.
మీ అందరి ప్రేమను పొందా అంటూ తెలిపారు.దీంతో పాటుగా మరో బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫోటోను షేర్ చేసాడు.

ఈ స్టైలిష్ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.ఇక ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.కాగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.చూడాలి నాని కాన్ఫిడెంట్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో.







