నెల్లూరులో బ్యాంక్ ఉద్యోగి ఘరానా మోసం.. రెన్యువల్స్ చేయకుండా లక్షల్లో వడ్డీ సొమ్ము స్వాహా..!

Canara Bank Employee Cheated Customers In Nellore Details, Canara Bank Employee Cheated , Bank Customers ,nellore, Bhaskar, Canara Bank, Renewals, Gold Loans, Canara Bank Employee Bhaskar

నెల్లూరు( Nellore ) నగరంలో స్థానికంగా ఉండే కెనరా బ్యాంకులో( Canara bank ) ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.బంగారు నగలపై రుణాలు ఇచ్చే భాగంలో పనిచేసే ఉద్యోగి భాస్కర్( Bhaskar ) చేతివాటం ప్రదర్శించి, లక్షల్లో వడ్డీ సొమ్ము స్వాహా చేశాడు.

 Canara Bank Employee Cheated Customers In Nellore Details, Canara Bank Employee-TeluguStop.com

బంగారు నగలపై రుణం తీసుకుని, తిరిగి వడ్డీ డబ్బులు చెల్లిస్తే వారి ఖాతాలను రెన్యువల్ చేయకుండా ఆ వడ్డీ డబ్బులను దోచేయడం ప్రారంభించాడు.ఎవరైనా ఖాతాదారులకు అనుమానంగా అనిపించినప్పుడు ఏవో టెక్నికల్ కారణాలు చెప్పి తర్వాత ఖాతాలో జమ అవుతాయని నమ్మకపు మాటలు చెప్పేవాడు.

Telugu Bank Customers, Bhaskar, Canara Bank, Canarabank, Gold Loans, Nellore, Re

కానీ బ్యాంకు సిబ్బందికు భాస్కర్ పై అనుమానం రావడంతో అధికారులు 600 మంది ఖాతాదారులకు నోటీసులు జారీ చేశారు.ఇందులో ఇప్పటివరకు 130 మంది వడ్డీ కట్టిన కూడా రెన్యువల్ చేయకుండా, వడ్డీ డబ్బులు బ్యాంకులో జమ చేయకుండా చేతివాటం ప్రదర్శించినట్లు గుర్తించారు.ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.నోటీసులు అందుకున్న ఖాతాదారులు బ్యాంకు ముందు ఆందోళన చేయగా.అధికారులు తామేమి చేయలేమని చేతులెత్తేశారు.సుమారుగా 50 లక్షల రూపాయల మేర కాజేసిన భాస్కర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

అంతే కాకుండా కొందరు ఖాతాదారులతో కలిసి నకిలీ బంగారాన్ని పెట్టి రుణాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.

Telugu Bank Customers, Bhaskar, Canara Bank, Canarabank, Gold Loans, Nellore, Re

బ్యాంక్ అధికారులు ఫిబ్రవరిలో లావాదేవీలు చెక్ చేస్తున్న క్రమంలో ఒక రెన్యువల్ మిస్సైంది.ఆ మిస్ అయినా రెన్యువల్ పాత బీరువాలో కనిపించడంతో.బ్యాంక్ సిబ్బందికు అనుమానం వచ్చింది.

సంవత్సరం దాటిన వడ్డీ డబ్బులు కట్టకుండా, రెన్యువల్ చేయించుకోకుండా ఉండే 600 మంది ఖాతాదారులకు నోటీసులు పంపించారు.ఇప్పటికీ 130 మంది ఖాతాదారులు సంవత్సరం తర్వాత వడ్డీ కట్టేశామని, కానీ రెన్యువల్ చేయలేదు కనీసం నోటీసు కూడా పంపించలేదు.

ఇప్పుడేమో లోన్ అమౌంట్ కట్టమని నోటీసు పంపించారని ఆందోళనకు దిగారు.ఈ అవకతవకలలో మిగతా బ్యాంకు ఉద్యోగుల హస్తం కూడా ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube