నో ఫ్లై లిస్టులో పేరు, పైగా ఉగ్రవాది.. నిజ్జర్‌కు ఇంతటి గౌరవమా , మీడియా ప్రశ్నకు తడబడ్డ కెనడా ఉప ప్రధాని

ఖలిస్తాన్ ఉగ్రవాది , ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్యకు ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా పార్లమెంట్‌లో ఆయనకు నివాళులర్పించడం, స్వయంగా ఎంపీలు లేచి నిలబడి మౌనం పాటించడం విమర్శలకు దారి తీస్తోంది.

భారత ప్రభుత్వం ఒక ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తికి ట్రూడో సర్కార్ ఈ స్థాయిలో గౌరవం ఎందుకు కల్పిస్తోందని నెటిజన్లు భగ్గుమంటున్నారు.

ఈ నేపథ్యంలోనే మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక కెనడా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్( Deputy Prime Minister Chrystia Freeland ) తడబడ్డారు.నో ఫ్లై లిస్టులో ఉండి, మరణానికి ముందు తన బ్యాంక్ ఖాతాలు స్తంభింపజేయబడిన ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు ఈ స్థాయిలో నివాళి ఎందుకు జరుపుతున్నారని మీడియా ఆమెను ప్రశ్నించింది.

నిజ్జర్‌పై గత ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ.ట్రూడో ప్రభుత్వం అతనిని ఎందుకు గౌరవిస్తోందని ఫ్రీలాండ్‌ను ఓ జర్నలిస్ట్ అడిగాడు.

దీనికి ఆమె జవాబిస్తూ.కెనడా గడ్డపై కెనడా పౌరుడి హత్యను ఖండిస్తూ ప్రధాని జస్టిన్ ట్రూడో ( Prime Minister Justin Trudeau )వైఖరిని ప్రశంసించారు.

Advertisement

ఇది అంత తేలిక కాదని, దీనికి ఎంతో ధైర్యం కావాలని ఆమె అన్నారు.

కెనడియన్ చట్టాల ప్రకారం సమానత్వం, బెదిరింపుల నుంచి రక్షణ అందరికీ వర్తిస్తుందని.ఈ విషయంలో జస్టిన్ ట్రూడో నిబద్ధతను ఫ్రీలాండ్ పునరుద్ఘాటించారు.అయితే ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను నో ఫ్లై లిస్ట్‌లో ఎందుకు చేర్చారు, అతని బ్యాంక్ ఖాతాలను ఎందుకు స్తంభింపజేశారు.

అతనికి పార్లమెంట్ నివాళులర్పించడం వెనుక కారణాలేమిటనే దానిపై మాత్రం ఫ్రీలాండ్ సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు.

కాగా.గతేడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని ( British Columbia )సర్రే పట్టణంలోని ఓ గురుద్వారా వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.దీని వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందంటూ ట్రూడో వ్యాఖ్యానించారు.నిజ్జర్ స్వగ్రామం పంజాబ్‌లోని జలంధర్ నగర శివారులోని భార్‌సింగ్ పుర .1997లో కెనడాకు వలస వెళ్లిన నిజ్జర్ .అక్కడ ఖలిస్తాన్ వేర్పాటువాదులతో సన్నిహిత సంబంధాలు నెరిపేవాడు.ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఏర్పాటు చేసి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు కెనడాలోని సిక్కు యువతలో ఖలిస్తాన్ భావజాలాన్ని నూరిపోసేవాడు.

వైరల్ వీడియో : పెళ్లికి వెళ్లిన అతిధిలకు భారీగా డబ్బులతో ఉన్న గిఫ్ట్ కవర్..
ఇదేందయ్యా ఇది.. స్వర్గంలో మీటర్ స్థలం రూ.8,000... కొనుక్కోడానికి ఎగబడుతున్న జనం..?

దీంతో 2020లో భారత ప్రభుత్వం నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు