అప్రమత్తం కండి.. కెనడా దేశం కోరి పిలుస్తోంది మరి!

అవును, మీరు విన్నది నిజమే.కెనడా దేశం( Canada ) ప్రస్తుతం కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 Canada Announces New Open Work Permit For Spouse And Family Details, Canada , Ca-TeluguStop.com

కెనడాలో కొనసాగుతున్న కార్మికుల కొరతను( Labor Shortage ) అధిగమించడానికి ఆ దేశం ఇపుడు వర్క్ పర్మిట్( Work Permit ) నిబంధనల విషయంలో పలు సడలింపులు చేయాలని చూస్తోంది.ఇతర దేశాలకు చెందిన వాళ్లు శాశ్వతంగా తమ దేశంలో కుటుంబ సభులతో కలిసి పని చేయడానికి కూడా అనుమతించే విధంగా కొత్త కొత్త నిబంధనలను ప్రకటించాలని కెనడియన్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

అదే విధంగా, కార్మికుల కొరతను వీలైనంత తొందరగా తగ్గించేందుకు.వీసాల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది.ఎవరైనా తమ జీవిత భాగస్వామి( Life Partner ) కోసం దరఖాస్తు పెట్టుకున్న వీసా ప్రక్రియను త్వరగా మంజూరు చేయాలని అక్కడి ప్రభుత్వం సంబంధిత డివిజన్లకు సూచించినట్టు సమాచారం.అంతేకాదు.

ఎవరైనా కెనడాకు రావాలనుకునేవారి దరఖాస్తులను 30 రోజుల్లో పరిష్కరించాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది.

ఇకపోతే, కెనడా అనేది ఉత్తర అమెరికాలోని అతి పెద్ద దేశం అన్న సంగతి అందరికీ తెలిసినదే.ఈ దేశం పశ్చిమములోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పడమరలోని పసిఫిక్ మహాసముద్రము వరకి వ్యాపించి ఉండడం వలన వైశాల్యంలో అతి పెద్దదిగా ఉంటుంది.ఉత్తరములోని ఆర్కిటెక్ మహాసముద్రము లోపలకు కూడా వ్యాపించి ఉంటుంది.

అందుకనే విస్తీర్ణంలో ప్రపంచములోనే 2వ అతి పెద్ద దేశంగా దీనిని పేర్కొన్నారు జియోగ్రాఫికల్ నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube