యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా రూపొందిన ఆదిపురుష్( Adipurush ) సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ సినిమా తర్వాత కేజీఎఫ్( KGF ) దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వం లో రూపొందుతున్న సలార్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సలార్ సినిమా ను అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేయబోతున్నారు.ప్రభాస్ ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తున్నాడు.
ఇవన్నీ కాకుండా అర్జున్ రెడ్డి దర్శకత్వం లో కూడా ప్రభాస్ సినిమా కమిట్ అయ్యాడు.ఆ మధ్య ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల అయ్యింది.ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ పై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.2025 సంవత్సరం లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.కానీ తాజాగా సినిమా నిర్మాణం నుండి యూవీ క్రియేషన్స్( UV Creations ) తప్పుకోవడంతో సినిమా ఆగిపోయింది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
కానీ అసలు విషయం ఏంటి అంటూ యూవీ క్రియేషన్స్ వారు తప్పుకున్నా కూడా టీ సిరీస్( T series ) వారితో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు స్పిరిట్ సినిమా ను భారీ బడ్జెట్ తో రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి ప్రభాస్ స్పిరిట్ సినిమా యొక్క చర్చ కు తెర పడ్డట్లు అయ్యింది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే స్పిరిట్ సినిమా ను 2025 లోనే విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేసేందుకు చర్చలు జరిగాయి అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు.
ఇక పాన్ ఇండియా అన్నట్లుగా కాకుండా మొత్తం ఎనిమిది భాషల్లో ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను విడుదల చేస్తే ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.