కెనడా : అల్బెర్టా ప్రావిన్షియల్ ఎన్నికల్లో నలుగురు భారత సంతతి అభ్యర్ధుల విజయం

కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్‌లో( Alberta, Canada) జరిగిన ఎన్నికల్లో పంజాబీ కమ్యూనిటికీ చెందిన నలుగురు అభ్యర్ధులు ఘన విజయం సాధించారు.కాల్గరీ, ఎడ్మంటన్‌లలో పోటీ చేసిన మొత్తం 15 మంది పంజాబీ అభ్యర్ధులలో నలుగురు ప్రజల ఆమోదాన్ని పొందారు.

 Canada 4 Indian Origin Candidates Victory In Alberta Provincial Polls , Alberta-TeluguStop.com

యునైటెడ్ కన్జర్వేటివ్ పార్టీ ( United Conservative Party )(యూసీపీ) నుంచి కేబినెట్ మంత్రిగా వున్న రాజన్ సాహ్నీ కాల్గరీ( Rajan Sawhney Calgary ) నార్త్ వెస్ట్‌లో న్యూ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ)కి చెందిన మైఖేల్ లిస్బోవా స్మిత్‌ను( Michael Lisboa Smith ) ఓడించి విజయం సాధించారు.రాజన్ విజయం ద్వారా.

ప్రజలు తమ ప్రయోజనాల విషయంలో సమర్ధవంతంగా వ్యవహరించిన వ్యక్తులపై విశ్వాసం చూపుతారు అనడానికి నిదర్శనం.

-Telugu NRI

ఖల్సా వోక్స్ నివేదిక ప్రకారం.ప్రస్తుతం ఎన్డీపీ నుంచి ఎమ్మెల్యేగా వున్న జస్వీర్ డియోల్ ఎడ్మంటన్ మెడోస్ నుంచి తిరిగి ఎన్నికయ్యారు.తద్వారా నియోజకవర్గంలో తనకున్న బలమైన సంబంధాన్ని ఆయన మరోసారి రుజువు చేసుకున్నారు.

యూసీపీ అభ్యర్ధి అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) మాథారుపై డియోల్ విజయం సాధించారు.ఎన్డీపీకి చెందిన పర్మీత్ సింగ్ బొపోరాయ్( Parmeet Singh Boporai ) .కాల్గరీ ఫాల్కన్‌రిడ్జ్ నుంచి యూసీపీ అభ్యర్ధి దేవిందర్ టూర్‌ను ఓడించి విజయం సాధించారు.బొపోరాయ్ విజయం .ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అనడానికి నిదర్శనమని ఖల్సా వోక్స్ నివేదించింది.కాల్గరీ నార్త్ ఈస్ట్‌లో యూసీపీకి చెందిన ఇందర్ గ్రేవాల్‌ను ఓడించి ఎన్డీపీ అభ్యర్ధి గురీందర్ బ్రార్ విజయం సాధించారు.

-Telugu NRI

ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు భారత సంతతి అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు.వీరిలో అమన్‌ప్రీత్ సింగ్ గిల్, రమణ్ అథ్వాల్, ఆర్ సింగ్ బాత్, గురీందర్ సింగ్ గిల్, హ్యారీ సింగ్, అమన్ సంధు, జీవన్ మంగత్, బ్రహ్మం లడ్డూలు ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.కాగా.అల్బెర్టా ప్రావిన్స్‌లో పంజాబీల ఆధిపత్యం ఎక్కువ.2021 జనాభా లెక్కల ప్రకారం కెనడాలో స్థిరపడిన సిక్కు జనాభాలో సగానికి పైగా బ్రాంప్టన్, సర్రే, కాల్గరీ, ఎడ్మంటన్ నగరాల్లోనే నివసిస్తున్నారు.ఖల్సా వోక్స్ నివేదిక ప్రకారం.

ఈ ఎన్నికల్లో పంజాబీ అభ్యర్ధులు సాధించిన విజయాలు కెనడియన్ సమాజంలో పెరుగుతున్న భారతీయుల రాజకీయ ప్రభావాన్ని, ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube