మగ నెమలి కన్నీరు తాగడం వల్లే ఆడ నెమలికి గర్భం వస్తుందా?

ఈ ప్రకృతిలో నెమలి ఎంతో అందమైన జీవి.దానిని చూస్తూ మైమరిచిపోవాల్సిందే.

భారతీయ పురాణాల్లోనూ నెమలికి మంచి స్థానం ఉంది.

శ్రీకృష్ణుడు నెమని పించాన్ని తలపై ధరిస్తాడు.

అలాగే సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి.అలా పురాణాల్లో నెమలికి ఎంతో విశిష్టత ఉంది.

నెమళ్లు అసలు సంభోగంలో పాల్గొనవని కొందరు అంటారు.మగ నెమలి పరవశించి నాట్యం చేసినప్పుడు దాని కంటి నుండి వచ్చే కన్నీటిని తాగడం ద్వారా ఆడ నెమని గర్భం దాల్చుతుందని గర్భం వస్తుందని చెబుతుంటారు.

Advertisement

నెమలి ఈకను తలపై శ్రీకృష్ణుడు అందుకే ధరిస్తాడని చెబుతుంటారు.అలా శ్రీకృష్ణుడిని అస్కలిత బ్రహ్మచారి అని అంటారని అంటున్నారు.

కానీ ఈ వివరణలో ఎలాంటి వాస్తవలం లేదని జీవశాస్త్రజ్ఞులు స్పష్టం చేస్తున్నారు.కలయికలో పాల్గొనకుండా నెమళ్లు పునరుత్పత్తి చేస్తాయన్నది పూర్తిగా అబద్ధమని వైద్యులు చెబుతున్నారు.

సంభోగం ద్వారా మాత్రమే గర్భం వస్తుందని, అది ప్రకృతి నియమం అని అంటున్నారు.

మగ జీవి నుండి వచ్చే శుక్ర కణాలు, స్త్రీ జీవిలోని బీజ కణాలతో కలిస్తేనే పిండం ఉత్పత్తి అవుతుందని వైద్యులు చెబుతున్నారు.కన్నీటి ద్వారా, నోటి ద్వారా శుక్ర కణాలు ఉత్పత్తి కావని వెల్లడిస్తున్నారు.ఇక మగ నెమని ఆడ నెమలి కంటే చాలా అందంగా ఉంటుంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..

దీనికి కారణం ఏమిటంటే.ఆడ నెమళ్లను ఆకర్షించడానికి ప్రకృతి సిద్ధంగా మగ నెమళ్లకు అందం సిద్ధించింది.

Advertisement

వాటి అందంతో, నృత్యంతో ఆడ నెమళ్లను ఆకర్షించి వాటితో కలుస్తాయని జీవ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

తాజా వార్తలు