ఈకాలంలో పెదాలపై వచ్చే దద్దుర్లకు ఆకాలంలో పెట్టుకున్న ముద్దులే కారణమట?

వినడానికి ఇదెక్కడి చోద్యం అని అనిపించినా, ఇది నిజం.మనలో కొంతమందికి అరుదుగా పెదాలపైన దద్దుర్లు వంటి ర్యాషెస్ వస్తూ ఉంటాయి.

 Cambridge Scientists Found Modern Herpes Variants Linked To Ancient Kissings  De-TeluguStop.com

ఇది అంత ప్రమాదకణం కాకపోయినప్పటికీ చూడటానికి మాత్రం అసహ్యంగా ఉంటుంది.ఇలాంటి దద్దుర్లు ముఖ్యంగా ఆడవారికి న్యూనతా భావానికి గురయ్యేలా చేస్తుంటాయి.

అయితే ఈ రోగం ఎక్కువగా US కంట్రీలో కనిపిస్తూ ఉంటుంది.అరుదుగా మనదగ్గర కూడా చూడవచ్చును.

అయితే నిపుణులు ఇలాంటి సమస్యలను తేలికగా అధిగమించొచ్చని చెబుతారు.

ఇకపోతే ఈ విషమై ఓ గమ్మత్తైన విషయం బయటపడింది.అదేమిటంటే… కాంస్య యుగంలో పెట్టుకున్న ముద్దుల కారణంగా ఈ కలియుగంలో ఇలా జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.కేంబ్రిడ్జ్‌లోని సైంటిస్టులు పెదాలపై ఏర్పడే పుండ్లకు “సింప్లెక్స్ వైరస్” కారణమని గుర్తించారు.

దీని శాంపుల్స్ పరీక్షించగా అవి 4వేల 500 సంవత్సరాల క్రితం వేరియంట్ అని తేలింది.పూర్వీకుల నుంచి ఈ వైరస్ వ్యాపించిందని.వైరాలజిస్ట్ డాక్టర్ షార్లెట్ హౌల్డ్‌క్రాఫ్ట్ చెప్పారు.హెర్పెస్ సింప్లెక్స్ వైరస్, లేదా HSV-1, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 బిలియన్ల మందికి సోకుతుంది.

Telugu Cambridge, Kisses, Lips, Modern Herpes, Latest-Latest News - Telugu

మానవులు సంభోగానికి ముందు పెట్టుకునే ముద్దుల వల్ల ఇది ఉద్భవించిందని భావిస్తున్నారు.అయితే పురాతన DNA ఆఫ్రికా నుంచి ఎలా విస్తరించిందనే దానిపై మాత్రం సైంటిస్టులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.దాదాపు 3వేల పురావస్తు ప్రదేశాలలో కనిపించిన కొందరి DNAను పరీక్షించగా హెర్పెస్ ఇన్‌ఫెక్షన్‌లను ఉన్న UK, నెదర్లాండ్స్, రష్యాకు చెందిన నలుగురి నమూనాలపై పరీక్షలు జరిపారు.పురాతన DNA విశ్లేషణ ప్రకారం.

అప్పుడు హెర్పెస్ వైరస్ ఈ రోజు కనిపించే వైరస్‌తో సమానంగా ఉందని కాంస్య యుగంలో ముద్దులు పెట్టుకోవడం వల్ల వ్యాపించిందని, ఈ వేరియంట్ ఇప్పటిది కాదని తెలిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube