టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి సంబంధించిన ఏ సెలబ్రెటీ అయిన ఏ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలియగానే వెంటనే స్పందించి వారిని పరామర్శిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అనారోగ్య సమస్యతో భాదపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో వెంటనే చిరంజీవి స్పందిస్తూ తాను వెంటనే కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇకపోతే సమంత నటించిన యశోద సినిమా విడుదల అయిన అనంతరం ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాకి వచ్చినటువంటి ఆదరణ చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సమంతకు ఫోన్ చేసి తనతో సినిమా గురించి మాట్లాడారని అదేవిధంగా సినిమాలో సమంత నటనపై ప్రశంసల కురిపించారని తెలుస్తుంది.
అదేవిధంగా మరోసారి తన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడమే కాకుండా తనకు ధైర్యం చెప్పారని సమాచారం.

ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేయడంతో సమంత సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇక సమంత మొదటిసారి విడాకుల తర్వాత నటించిన యశోద సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది అయితే కమర్షియల్ పరంగా ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాలి.ఇకపోతే సమంత బాధపడుతున్న ఈ సమస్య కారణముతో ఈమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు.