సోషల్ మీడియాలో వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి.కొన్ని ఫన్నీగా ఉంటే.
మరికొన్ని షాకింగ్ కు గురిచేసేలా ఉంటాయి.ఇక్కడ ఒక అమ్మాయి చేస్తున్న వింత పనితో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ మేరీ షిహదేవ్ కు ఓ సూపర్ టాలెంట్ ఉంది.సాధారణంగా మనం మన నాలుకతో ఒకేసారి ఒక రుచిని మాత్రమే కనిపెట్టగలం.
కానీ మేరీ షిహదేవ్ మాత్రం ఒకేసారి రెండు వెర్వేరు టెస్ట్ లను చూడగలదు.ఈ అమ్మాయి సూపర్ టాలెంట్ ను చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం ఈ వేడియో నెట్టింట వైరల్ అవుతుంది.
వివరాల్లోకి వెళ్తే.
అమెరికా లోని కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ మేరీ షిహదేవ్.స్పెషల్ టాలెంట్ కోసం నాలుకకు శస్త్ర చికిత్స చేయించుకోగా.
నాలుకను రెండుగా విడగొట్టారు.ఈ క్రమంలో అమ్మాయి ఒకే సమయలో రెండు వెర్వెరు టెస్ట్ లను చూడగలదు.
వాటి రుచిని కూడా సులువుగా పసిగట్టగలదు.ప్రస్తుతం ఆమె గ్లాస్ లో డ్రింక్ ను తీసుకొని ఒకే సమయంలో రెండు నాలుకలతో టెస్ట్ లు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియోకి నెటిజన్లు తమదైన శ్రేణిలో కామెంట్స్ చేస్తున్నారు.ఒకరు ఆమెది సూపర్ టాలెంట్ అంటూ కామెంట్ చేస్తుండగా.
మరొకరు టాలెంట్ కోసం నాలుకను చీల్చుకోవడం ఏంటని మండిపడుతున్నారు.