కాళేశ్వరం ప్రాజెక్టుకు( Kaleshwaram Project ) సంబంధించిన కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) రూపొందించిన రిపోర్టును తెలంగాణ అసెంబ్లీలో( Telangana Assembly ) ప్రవేశపెట్టారు.డీపీఆర్ లో రూ.63,352 కోట్లు చూపెట్టగా రూ.లక్షా ఆరు వేల కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచారని కాగ్ నివేదికలో( CAG Report ) పేర్కొంది.ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉందని తెలిపింది.ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు రూ.1,47,427 కోట్లు ఖర్చు అవుతుందని కాగ్ నివేదికలో వెల్లడించింది.
అలాగే ప్రాజెక్టు వార్షిక ఖర్చులు తక్కువ చూపారని, ప్రాజెక్టు నిర్మాణం కోసం భారీగా రుణాలు తీసుకున్నారని తెలిపింది.రుణాలు చెల్లించడంలో కాలయాపన చేశారని చెప్పింది.ఈ క్రమంలోనే రుణాల చెల్లింపుల కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది.