బైరెడ్డి సిద్ధార్థ్ వ‌ర్సెస్ కాట‌సాని.. క‌ర్నూలులో రాజుకుంటున్న విభేదాలు..

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఈ పేరు వింటే చాలు యువత చెవి కోసుకుంటున్నారు.మనోడి మాస్ ఫోలోయింగ్ అంతా ఇంతా కాదు.

ఎల్లలు దాటుతోంది.మొన్నటివరకు నందికొట్కూరు నియోజకవర్గానికే పరిమితమైన ఈ ఫాలోయింగ్ ఇప్పుడు జిల్లాలు దాటుతోంది.

బైరెడ్డి కోసం జనం కూడా ఎగబడుతున్నారు.ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లు, యువతులు కూడా బైరెడ్డిని అభిమానిస్తున్నారని తెలిసింది.

ప్రస్తుతం సిద్దార్థ్ అధికార వైసీపీ పార్టీ తరఫున నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జిగా కొనసాగుతున్నారు.ఇటీవల సీఎం జగన్ నామినేటెడ్ పదవి కోటాలో స్పోర్ట్స్ శాఖకు చైర్మెన్‌గా నియమించారు.

Advertisement

అయితే, కర్నూలు జిల్లాలో బైరెడ్డి సిద్ధార్థ్ పేరు చెబితేనే మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కూడా భయపడుతున్నారట.భవిష్యత్తులో సిద్ధార్థ్ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని తెలియడంతో వారి భయం ఇంకా ఎక్కువ అయ్యిందని టాక్ వినిపిస్తోంది.

బైరెడ్డి సొంత నియోజకవర్గం నందికొట్కూరు గతంలో ఎస్సీ రిజర్వ్డ్ గా కేటాయించారు.వైసీపీ ఇంచార్జిగా బైరెడ్డి ఉన్నారు.

ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ గెలుపుకోసం అప్పట్లో బైరెడ్డి పనిచేశారు.కానీ ప్రస్తుతం వీరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది.

అధిష్టానం నుంచి జిల్లా ఇన్చార్జి మంత్రులు కూడా బైరెడ్డికే సపోర్టు ఇస్తున్నారు.ఒక వేళ వచ్చే ఎన్నికల్లో బైరెడ్డి పోటీ చేయాలనుకుంటే అందుకు జనరల్ సీటుగా ఉన్న పాణ్యం నియోజకవర్గం ఒక్కటే బైరెడ్డికి చాయిస్‌గా కనిపిస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ప్రస్తుతం అక్కడ నుంచి సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్నారు.

Advertisement

6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసానికి ఆ నియోజకవర్గంలో బలమైన సొంత వర్గం ఉంది.ఇప్పుడు బైరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తామన్న సంకేతాలు ఇస్తూ ఉండడంతో కాటసాని వర్గం అలర్ట్ అయ్యింది.అసలు బైరెడ్డిని నియోజకవర్గంలోనే అడుగు పెట్టనీయమంటూ కాటసాని వర్గం సవాల్ చేస్తోంది.

బైరెడ్డి నాలుగు డైలాగులు చెప్పినంత మాత్రాన ఎమ్మెల్యే సీటు రాదని, ఈ జిల్లాలోనే బైరెడ్డికి అంత సీన్ లేదని కాటసాని వర్గం చెబుతోందట.ఇక బైరెడ్డి దూకుడు జిల్లాలో కాటసానికి మాత్రమే కాకుండా మిగిలిన సీనియర్ నేతలు, మంత్రులకు కూడా కాస్త ఇబ్బందికరంగానే మారిందని చర్చ నడుస్తోంది.

తాజా వార్తలు