2 స్పూన్లు ధనియాలతో ఇలా చేశారంటే చుండ్రుకు బై బై చెప్పవచ్చు!

ప్రస్తుత వర్షాకాలంలో విపరీతంగా ఇబ్బంది పెట్టే జుట్టు సమస్యల్లో చుండ్రు ముందు వ‌రుస‌లో ఉంటుంది.పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది చుండ్రు(dandruff) సమస్యతో బాధపడుతుంటారు.

చుండ్రును వదిలించుకోవడం కోసం ఖరీదైన షాంపూను వాడుతుంటారు.అయితే మార్కెట్లో లభ్యమయ్యే షాంపూల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

ధనియాలు(coriander seeds) మాత్రం చాలా సమర్థవంతంగా చుండ్రును వదిలిస్తాయి.అందుకోసం ధనియాలను ఏ విధంగా ఉపయోగించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు(dandruff) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

Advertisement

మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి నానబెట్టుకున్న ధనియాలు మరియు మెంతులను ఐదు నుంచి ఆరు నిమిషాలు పాటు ఉడికించి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ చల్లారే లోపు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ అలోవెరా జ్యూస్ లో ధనియాలు మరియు మెంతుల(Fenugreek) వాటర్ ను వేసి బాగా కలిపితే ఒక హెయిర్ టోనర్ సిద్ధమవుతుంది.ఈ హెయిర్ టోనర్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ విధంగా కనుక చేశారంటే చుండ్రు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పరిగెడుతుంది.

ఇక కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక లేనట్టే ? 
రష్యన్ యువతి కోరికలు విన్నారా.. ముందుగా అదే కావాలట..

చుండ్రును వదిలించడంలో ఈ హెయిర్ టోనర్ అనేది చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.పైగా ఈ న్యాచురల్ టోనర్ ను వాడడం వల్ల జుట్టు సిల్కీగా మరియు స్ట్రాంగ్ గా మారుతుంది.జుట్టు రాలడం అనేది కంట్రోల్ అవుతుంది.

Advertisement

జుట్టు చిట్లే సమస్య తగ్గుతుంది.కాబట్టి చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు మాత్రమే కాదు హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ (Hair fall, hair damage)వంటి ప్రాబ్లమ్స్ తో సతమతం అవుతున్న వారు కూడా పైన చెప్పిన హెయిర్ టోనర్ ను వాడేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు