Ravi Teja Eagle : ఆ సెంటిమెంట్ ను మాస్ మహారాజ్ బ్రేక్ చేస్తారా.. ఈసారైనా రవితేజకు లక్ కలిసొస్తుందా?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

 Buzz On Raviteja Eagle Movie-TeluguStop.com

గత ఏడాది వాల్తేరు వీరయ్య, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ తాజాగా ఈగల్ సినిమా( Eagle )తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు.ఇది ఇలా ఉంటే రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో చాలా వరకు మాస్ మసాలా సినిమాలే ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.

రవితేజకు ఎక్కువగా మాస్ క్యారెక్టర్లే సూట్ అవుతుండడంతో ఎక్కువగా అలాంటి సినిమాలని ఎంచుకుంటున్నారు.రవితేజ పక్కా మాస్ సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అన్నట్లుంటుంది.

Telugu Eagle, Kavya Thapar, Ramarao Duty, Raviteja, Tollywood-Movie

వాటికి మంచి టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంది.అలా అని రవితేజ ఎప్పుడూ రొడ్డకొట్టుడు సినిమాలే చేస్తాడనేమీ లేదు.మధ్య మధ్యలో ప్రయోగాత్మక కథలు కూడా చేస్తున్నాడు.అలాంటి కథలను నమ్మి చాలా సిన్సియర్‌గా నటించాడు.కానీ అతనెంత బాగా చేసినా కూడా తన శైలికి భిన్నమైన సినిమాలు చేసిన ప్రతిసారీ నిరాశే ఎదురైంది.నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, సారొచ్చారు, డిస్కో రాజా, రామారావు ఆన్ డ్యూటీ, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఇలా చాలా సినిమాలే ఉన్నాయి.

వీటిలో కొన్ని సినిమాల్లో విష‌యం ఉన్నా కూడా స‌రిగా ఆడ‌లేదు.

Telugu Eagle, Kavya Thapar, Ramarao Duty, Raviteja, Tollywood-Movie

దీంతో ర‌వితేజ డిఫ‌రెంట్ సినిమా చేస్తే నిరాశ త‌ప్ప‌దు అనే అభిప్రాయం బ‌ల‌ప‌డిపోయింది.ఈ నేప‌థ్యంలో ర‌వితేజ కొత్త సినిమా ఈగ‌ల్ మీద అంద‌రూ ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టారు.ఇది కొంచెం ప్ర‌యోగాత్మ‌క క‌థ‌తోనే తెర‌కెక్కిన‌ట్లు క‌నిపిస్తోంది.

మాస్ అంశాల‌కు లోటు లేక‌పోయినా ఫ‌క్తు మాస్ రాజా మార్కు సినిమాలా అయితే క‌నిపించ‌డం లేదు.ట్రైల‌ర్ చూసి క‌థ మీద ఒక అంచ‌నాకు రాలేని ప‌రిస్థితి.

కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని( Karthik Gattamneni ) ఇంత‌కుముందు సూర్య వెర్స‌స్ సూర్య అనే ప్ర‌యోగాత్మ‌క సినిమానే తీశాడు.ఈసారి మాస్ అంశాలు జోడిస్తూనే మాస్ రాజాను భిన్నంగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు.

ప్రోమోలు చూస్తే మాత్రం ఈగ‌ల్ స్పెష‌ల్ మూవీలా క‌నిపిస్తోంది.ర‌వితేజ స‌హా అంద‌రూ సినిమా మీద చాలా ధీమాగా ఉన్నారు.

మ‌రి డిఫ‌రెంట్ మూవీస్ చేస్తే క‌లిసిరావ‌న్న సెంటిమెంట్‌ను మాస్ రాజా ఈసారైనా బ్రేక్ చేస్తాడేమో చూడాలి.అయితే రేపు అనగా ఫిబ్రవరి 9 శుక్ర‌వార‌ం ఈగ‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube