బాలనటిగా ఎన్నో సినిమాల్లో అలరించిన శ్రీ దివ్య ( Sri Divya ) అందరికీ తెలిసే ఉంటుంది.ఈమె మొదటిసారి హీరోయిన్ గా మనసారా సినిమాలో నటించి అలరించింది.
ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో బస్ స్టాప్ సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఈ సినిమా హిట్ అయినప్పటికీ శ్రీదివ్యకి అవకాశాలు రాలేదు.అలాగే కేరింత( Kerintha ) ,మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు వంటి సినిమాల్లో నటించినప్పటికీ ఈ హీరోయిన్ కి తెలుగులో అవకాశాలు రాలేదు.దానికి ప్రధాన కారణం దర్శక నిర్మాతలు ఎవరు ఈమెకు తెలుగు హీరోయిన్ అని,అలాగే ఈమె అన్నింటికి సిద్ధమై ఉండదు అనే ఒకే ఒక్క కారణంతో అవకాశాలు ఇవ్వలేదట.
కానీ కోలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించి మంచి స్టార్టమ్ సంపాదించింది.అలా శ్రీదివ్య కోలీవుడ్ లో విశాల్( Vishal ) , శివ కార్తికేయన్ వంటి హీరోలతో నటించింది.
ఇక ఈ హీరోయిన్ శివ కార్తికేయన్ తో కలిసి కాకి సట్టై, వరుత్తపడాద వాలిబార్ సంఘం వంటి సినిమాల్లో నటించింది.అయితే ఈ సినిమాలో నటించే టైంలోనే శివ కార్తికేయన్( Siva Karthikeyan ) కి శ్రీ దివ్య కి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తుంది అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూసింది.

కానీ ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తే ఖచ్చితంగా ఈ వార్తలు మామూలే అని అందరూ కొట్టి పారేసారు.కానీ వీరి మధ్య వస్తున్న వార్తలు ఎక్కువ అవ్వడంతో ఈ విషయం తెలిసిన శివ కార్తికేయన్ భార్య( Siva Karthikeyan Wife ) ఆ హీరోయిన్ తో మరో సినిమాలో నటిస్తే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చిందట.అప్పటినుండి శివ కార్తికేయన్ శ్రీదివ్య కు దూరంగా ఉన్నారట.అంతేకాదు మరో సినిమాలో కూడా శ్రీదివ్యతో కలిసి నటించే అవకాశం వస్తే ఆమె ప్లేస్ లో వేరే హీరోయిన్ ని తీసుకొని వారి మధ్య వచ్చే ఎఫైర్ వార్తలకు చెక్ పెట్టారు.







