విజయవాడలోని ఆర్టీసీ బస్టాండ్ లో బస్సు బీభత్సం సృష్టించింది.నంబర్ 12వ ప్లాట్ ఫామ్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడగా పలువురు గాయపడ్డారు.మృతుల్లో మహిళ, చిన్నారితో పాటు కండక్టర్ ఉన్నారని తెలుస్తోంది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఏసీ బస్సు ప్లాట్ ఫామ్ వద్దకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో లోపలికి దూసుకెళ్లిందని సమాచారం.