బహుజన వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో మననుస్మృతి దహనం

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ సమీపంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర వ్యవస్థను బానిసత్వంలోకి నెట్టిన మనస్ఫృతిని బహుజన వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో గురువారం దహానం చేశారు.

ఈ సందర్భంగా బహుజన వామపక్ష సంఘాల నాయకులు మాట్లాడుతూ కుల వ్యవస్థకు మరియు అంటరానితనానికి అవమానియా చరిత్రకు కారణమైన మనుస్మృతి ప్రాచీన రాజ్యాంగం ఎట్లా అవుతదని ప్రశ్నించారు.

మనిషి జన్మను అవమానపరిచి మానవ అసమానుతలకు, బానిసత్వానికి,దోపిడీకి కారణమైన మనుస్ఫృతిని పునరుద్ధరించడానికి జరిగే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు.ఇది ధర్మశాస్త్రం కాదని అధర్మశాస్త్రమని,భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలని,అతనిపై రాజ ద్రోహం,పిడి యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.మహిళలకు చదువుకునే హక్కు లేదని ప్రకటించిన మనుధర్మశాస్త్రం మీకు ఏ విధంగా ధర్మశాస్త్రమైందని మనువాదులకు సవాలు విసిరారు.

రాజ్యాంగం సమానత్వాన్ని కోరుకుంటే ఈ మనుధర్మశాస్త్రం అసమానత్వాన్ని నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను ఏర్పరుస్తుందని, ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని అన్నారు.ఇప్పటికైనా ఈ మనుధర్మ శాస్త్రాన్ని మళ్లీ తీసుకురావాలని ప్రయత్నిస్తే బహుజనులు అందరం ఏకమై ప్రతిఘటిస్తామన్నారు.

Advertisement

ఇప్పటికైనా మేధావులు, విద్యార్థులు,మహిళలు అందరూ కలిసికట్టుగా ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు చామల అశోక్ కుమార్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు మండారి డేవిడ్ కుమార్, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి చామకూరి నరసయ్య, బహుజన ముక్తి పార్టీ జిల్లా కన్వీనర్ పల్లెటి రమేష్ కుమార్,బుద్ధ సత్యనారాయణ,దంతాల రాంబాబు,డిటిహెఫ్ జిల్లా నాయకులు రేపాక లింగయ్య,యోగానంద, సిహెచ్.

వెంకటయ్య,ఎల్ హెచ్ పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ నాగేంద్ర నాయక్,బిఎస్పి నాయకులు దాసరి రాములు,దళిత బహుజన మహాసభ నారబోయిన వెంకట యాదవ్,టైలర్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ పొన్నం రమేష్, పంతం యాకన్న,గంటా నాగయ్య,కునుగుంట్ల సైదులు,రామోజీ,పిడిఎస్ యు నాయకులు భరత్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు