డబ్బులు అంటే ఎవరికి అవసరం ఉండదు చెప్పండి.డబ్బులు లేకపోతే ఈ ప్రపంచంలో ఏ పని జరగదు.
పని సంగతి పక్కన పెడితే అసలు తిండి తిప్పలు లేక అలమటించాల్సిందే.ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బే.
ఆ డబ్బు సంపాదించడం కోసమే అందరూ కూడా కష్టపడుతున్నారు.అయితే అలాంటి డబ్బులు రోడ్డు పక్కన కుప్పలు తెప్పలుగా పడి ఉండడం చూసి దారిన పోయే జనాలు షాక్ అవుతున్నారు.
కళ్లముందు కరెన్సీ నోట్లు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాగాని ఎవరు కూడా ఆ కరెన్సీ నోట్లను ముట్టుకోవడం లేదు.ఎందుకు అనుకుంటున్నారా.? ఎందుకంటే ఆ డబ్బులు అన్ని చిరిగిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి కాబట్టి.కళ్ళముందు అన్ని డబ్బులు ఉన్నాగాని ఉపయోగించుకోలేని పరిస్థితి.
అవి చూసిన వారి కళ్లు చెదిరిపోయాయి.అసలు అన్ని డబ్బులను ఇలా ఎందుకు ముక్కలు ముక్కలుగా చేసి ఇక్కడ ఎందుకు పడవేశారని ఆలోచనలో పడ్డారు అందరు.
అసలు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో.ఏంటో అనే వివరాలు తెలుసుకుందామా.
ఈ షాకింగ్ ఘటన మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద హైదరాబాద్-నాగ్‌పుర్ నేషనల్ హైవేపై బుధవారం అంటే డిసెంబర్ 29 న జరిగింది.రోడ్డు పక్కన చిరిగిన కరెన్సీ నోట్లు కుప్పలుకుప్పలుగా కనిపించటంతో జనాలు షాక్ అయ్యారు.
రోడ్లపై వీస్తున్న గాలికి ఆ కరెన్సీ నోట్ల ముక్కలు చుట్టుపక్కల ప్రాంతాలకు ఎగిరి రావడంతో అందరూ కూడా ఏమి జరుగుతుందో తెలియక అయోమయంలో ఉండిపోయారు.తీరా చూస్తే రోడ్డు పక్కన పడి ఉన్న చిరిగిన నోట్లను చూసి అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్పాట్‌కు చేరుకుని కరెన్సీ నోట్ల తుక్కును స్వాధీనం చేసుకున్నారు.
అసలు అవి అక్కడికి ఎలా వచ్చాయి.? తుక్కుగా ఎలా మారాయి.? ఎవరు తీసుకుని వచ్చారు అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ నోట్ల తుక్కు ఘటన గురిచి పోలీసు అధికారులు మాట్లాడుతూ.
రిజర్వు బ్యాంకు ఇలా చేసే అవకాశం లేదని, పాత నోట్లను రహస్య ప్రదేశంలో కాల్చివేస్తుందని తెలిపారు.అలాగే ఆ డబ్బులను ఎక్కడికో తరలిస్తున్న క్రమంలో వాహనంలోంచి పొరపాటున పడిపోయి ఉండవచ్చని తాము భావిస్తున్నామని వాటి మీద వాహనాలు వెళ్లడంతో ముక్కలు అయిపొయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.అసలు అవి నిజమైన నోట్లేనా.? లేక డూప్లికేట్ నోట్లా .? అనేది తెలియవలిసి ఉందని చెప్పారు.అవి ఒకవేళ బ్లాక్ మనీ అయ్యి.
నకిలీ నోట్లు కానివి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు పోలీసులు.ఏ వాహనం నుంచి ఈ నోట్లున్న సంచి జారిపడిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఎవరు ఈ పని చేయిస్తున్నారు.? ఎందుకు చేయిస్తున్నారు.?ఎలా చేయించారు.? ఎందుకు ఇలా చేసారు.? ఇలా చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి.? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.