ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ 12 మినీ ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ స్మార్ట్‌ఫోన్ల ధర రూ.20,901 డిస్కౌంట్ తర్వాత రూ.38,999కి దిగి వచ్చింది.కస్టమర్లు తమ ఓల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకుంటే రూ.23,000 వరకు ఎక్స్ఛేంజ్ కూడా పొందవచ్చు.అప్పుడు దీని ధర రూ.15,999కి తగ్గింది.ఎక్స్ఛేంజ్ వాల్యూతో పాటు కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫ్ బరోడా, IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను దక్కించుకోవచ్చు.

రూ.5,000 అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ.1,500 వరకు ఈ కార్డుల ద్వారా ఈఎంఐ లావాదేవీలపై 10% డిస్కౌంట్ లభిస్తుంది.అప్పుడు దీని ధర రూ.14,499కి తగ్గుతుంది.ఐఫోన్ 12 మినీ ఫీచర్ల విషయానికి వస్తే.ఇది 5.4-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 12ఎంపీ డ్యూయల్ కెమెరా, A14 బయోనిక్ చిప్‌తో వస్తుంది.దీనిలో అందించిన 12MP TrueDepth ఫ్రంట్ కెమెరా వీడియో కాల్‌లు, సెల్ఫీల కోసం 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఐఫోన్ 12 మినీ 2020లో ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌తో పాటు విడుదలైంది, కానీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.అందుకే ఐఫోన్ 14 సిరీస్‌లో మినీ వేరియంట్ రిలీజ్ చేయలేదు.ఐఫోన్ 12 మినీ ప్రారంభ ధర రూ.69,900 అయినప్పటికీ, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లతో కలిపి రూ.14,499కి అందుబాటులో ఉంది.ఈ ఫోన్ సైజు, బిల్ట్ క్వాలిటీ స్టాండర్డ్ వెర్షన్ తో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది.
అందువల్ల, బిగ్ స్క్రీన్ ఇష్టపడే వారు, బిగ్ స్క్రీన్ కి అలవాటు పడ్డవారు దీనిని పెద్దగా వాడు లేరు.







