జబర్దస్త్ షోలో గుండు గీయించుకున్న బుల్లెట్ భాస్కర్.. ఖుష్బూ అలా కామెంట్స్ చేసి వెళ్లిపోవడంతో?

జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకు గతంతో పోల్చి చూస్తే రేటింగ్స్ తగ్గినా ఈ షోను ఈ జనరేషన్ లో కూడా అభిమానించే వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ తాజా ప్రోమో( Extra Jabardasth ) విడుదల కాగా ఈ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ గుండు చేయించుకోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

 Bullet Bhaskar Comments Goes Viral In Social Media Details Here , Bullet Bha-TeluguStop.com

ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ నిజం సినిమాలోని గోపీచంద్ పాత్రకు స్పూఫ్ చేశారు.

మహేష్ పాత్రలో జబర్దస్త్ నరేష్, తల్లి పాత్రలో ఫైమా చేయగా నరేష్( Naresh ) “ఇది చెయ్యి.ఇది పిడికిలి” అని చెప్పగానే మొత్తం కలిపి నా చెయ్యి అంత లేదు కదరా అంటూ బుల్లెట్ భాస్కర్ పంచ్ వేశారు.ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ పెద్దమ్మ తల్లికి అమ్మోరును బలియ్యండిరా అని చెప్పగా జడ్జి కృష్ణ భగవాన్( Krishna Bhagavaan ) మాట్లాడుతూ గోపీచంద్ గారు పెద్దమ్మ తల్లి దగ్గరకు వెళ్లినప్పుడు గుండు ఉంటుంది కదా అని అడుగుతారు.

బుల్లెట్ భాస్కర్ వెంటనే ఫస్ట్ నుంచి పెట్టుకోవాలి సార్ మధ్యలో గుండు సెటప్ అంటే కష్టం అని అన్నారు.ఖుష్బూ( Kushboo ) వెంటనే స్పూఫ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఉండాలి కదా ఫీల్ రావడానికి ఏం లేదు కదా మరీ అని కామెంట్ చేయగా నేను స్కిట్ కోసం ప్రాణం ఇస్తా అలాంటిది జుట్టు పెద్ద ఇంపార్టెంట్ కాదు అంటూ బుల్లెట్ భాస్కర్ గుండు చేయించుకున్నారు.భాస్కర్ నిజంగానే గుండు చేయించుకున్నట్టు ప్రోమోలో చూపించారు.ఇప్పుడు ఓకేనా సార్ అని భాస్కర్ అడగగా ఆ ఎఫెక్ట్ కావాలన్నాం కానీ నిజంగానే గుండు గీయించుకుంటే ఎలా అని కృష్ణభగవాన్ ప్రశ్నించగా అది మీరు ముందు చెప్పాలని భాస్కర్ కౌంటర్ ఇచ్చారు.

ఆ తర్వాత ఖుష్బూ జడ్జిగా మా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ లేదా అంటూ ఆమె అక్కడినుంచి వెళ్లిపోయారు.నవంబర్ నెల 24వ తేదీన ఈ షో ప్రసారం కానుంది.

https://youtu.be/4CblGVTtCk0
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube