పులిని ఉరికెత్తించిన ఎద్దు.. ఈ వీడియో చూస్తే ఫిదా అవుతారు!

సాధారణంగా పులులు చాలా చురుకుగా ఉంటాయి.వేటాడడంలో వీటికి మించిన క్రూర మృగం మరేదీ లేదని చెప్పవచ్చు.

 Bull Scares Away The Tiger Viral Video Details, Tiger, Buffalo, Viral Latest, Ne-TeluguStop.com

దేనినైనా అత్యంత ఘోరంగా చంపేసి తినేసే ఈ ప్రెడేటర్స్‌ ఒక్కోసారి మాత్రం తమ కంటే బలహీనమైన జంతువులను చూసి కూడా తోక ముడుచుకుని పారిపోతుంటాయి.తాజాగా అలాంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.ఈ వీడియోలో ఒక ఎద్దు పులిని ఉరికించింది.

అనంతరం అది ప్రాణాలతో బయట పడింది.దీన్ని చూసిన నెటిజన్లు అబ్బరపడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక రోడ్డుపై వాహనాలు ఆగి ఉండటం చూడవచ్చు.అదే రోడ్డుపై ఒక ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తోంది.పక్కనే పొదలలో నుంచి ఒక పులి ఎద్దుని గమనించింది.అనంతరం దాని పై దాడి చేసేందుకు ప్రయత్నించింది.

కానీ ఎద్దు తన కొమ్ములతో పొడిచేందుకు భయంకరంగా దూసుకొచ్చింది.దాంతో పులి ఒక్కసారిగా వెనక్కి పరిగెత్తింది.

ఆ తర్వాత మళ్లీ ఎద్దు జోలికి అది వెళ్లలేదు.

నిజానికి ఈ ఎద్దు ముఖానికి ఒక మాస్క్ తొడిగారు.

అలాగే ఇక్కడ చాలామంది మనుషులు, వాహనాలు ఉన్నాయి.దాంతో పులి ఎద్దు మాస్క్ చూసి కంగారు పడటం తో పాటు మనుషులు అక్కడే ఉండటంతో మరింత భయపడింది.

దాంతో అది వెనక్కి తగ్గింది.ఒకవేళ మనుషులు ఎవరూ లేకపోతే పులి ఎద్దును నిమిషాల వ్యవధిలో చంపేసి ఉండేది.

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube