దున్నను రౌండప్ చేసిన 10 సింహాలు.. ఎలా తప్పించుకుందో తెలుసా..?

జంతువులు ఒకదానిపై ఒకటి పరస్పరం దాడి చేసుకుంటూ ఉంటాయి.దాడి చేసుకుని గాయపర్చుకుంటూ ఉంటాయి.

 Buffalo Outsmarts Lions And Survived An Attack Video Viral Details, Viral Latest-TeluguStop.com

కొన్ని జంతువులు ఆహారం కోసం వేటాడుతూ మిగతా జంతువులపై దాడి చేసి తింటూ ఉంటాయి.పులులు, సింహాలు వంటివి మిగతా జంతువులను చంపేసి ఆహారం తీసుకుంటాయి.

అలాగే తాజాగా వేటకు వెళ్లిన కొన్ని సింహాలు.( Lions ) ఒక అడవి దున్నపోతును చుట్టుముట్టాయి.

అడవి దున్నపై ( Buffalo ) దాడి చేసేందుకు ప్రయత్నాలు చేశాయి.కానీ అడవి దున్న సింహాల దాడి చేసి తెలివిగా తప్పించుకుంది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

సింహం ఎలాంటి జంతువునైనా సరే మట్టుకరిపించగలదు.వెంటాడి వెంటాడి చంపి తినేస్తుంది.తాజాగా సింహాలకు అడవి దున్నపోతు కనిపించింది.

ఇంకేముంది ఆకలి మీద ఉన్న సింహాలు దానిని చుట్టుముట్టాయి.దానిని వెంబడించాయి.

సింహాల నుంచి తప్పించుకోవడమంటే చాలా కష్టం.అలాంటిది ఈ దున్నపోతును 10 సింహాలు( Ten Lions ) చుట్టుముట్టాయి.

అయినా వాటి నుంచి తెలివిగా తప్పించుకుంది.సింహాలను వేటాడుతున్నా భయపడకుండా ధైర్యంతో ఎదుర్కొంది.

తెలివిని ప్రదర్శించి వాటి బారి నుంచి తప్పించుకుంది.

సింహాలు చుట్టుముట్టడంతో పక్కనే ఉన్న నీటి కొలనులోకి దున్నపోతు దిగింది.సింహాలు నీటిలోకి రావు.దీంతో సింహాల నుంచి ఇలా తప్పించుకుంది.

నీటిలోకి దిగి ఇప్పుడు రండి రా.చూసుకుందాం అన్నట్లు దున్నపోతు ఒక లుక్ ఇచ్చింది.తెలివిగా సింహాల నుంచి తప్పించుకున్న ఈ దున్నపోతుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.ఈ వీడియోలో సింహాలు వెంటాడుతుండగా.దున్నపోతు నీళ్లల్లోకి దిగినట్లు కనిపిస్తుంది.దీంతో సింహాలు నీళ్లల్లోకి దిగలేక అలాగే ఉండిపోయాయి.

ఈ దున్నపోతు ధైర్యం, తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.దున్నపోతుకు తెలివి మాములుగా లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube