పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023-24

పార్లమెంట్ లో బడ్జెట్ 2023-24ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు.దేశం వృద్ధి రేటు శరవేగంగా పెరుగుతోందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

 Budget 2023-24 Before Parliament-TeluguStop.com

భారత్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు.కరోనా కాలంలో ఎవరూ ఆకలితో బాధపడకుండా చూశామన్న కేంద్ర ఆర్థిక మంత్రి ఉచిత ఆహార పథకం 2024 వరకు కొనసాగుతుందని తెలిపారు.

తొమ్మిదేళ్లలో తలసారి ఆదాయం రెట్టింపు అయిందని పేర్కొన్నారు.

సప్తరుషుల రీతిలో ఏడు అంశాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించారు.

సమిష్టి ప్రగతి దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు.బడ్జెట్ లో వ్యవసాయం కోసం డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలతో పాటు వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్ సదుపాయం కల్పించనున్నారు.

వ్యవసాయ స్టార్టప్స్ కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నారు.అదేవిధంగా దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.81 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేస్తామన్నారు.అంతేకాకుండా పీఎం విశ్వకర్మ యోజన తీసుకొస్తామని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube