ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం సాధించలేక ఎంతోమంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఎన్ని ఇంటర్వ్యూలకు హాజరైనా ఉద్యోగం రావడం లేదని కొంతమంది వ్యాపారం దిశగా అడుగులు వేస్తున్నారు.
చాట్ జీపీటీ( Chat GPT ) లాంటి టెక్నాలజీల వల్ల సాఫ్ట్ వేర్ రంగంలో కూడా ఉద్యోగాలు సాధించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం గమనార్హం.
అయితే ఒక నిరుద్యోగి మాత్రం బీటెక్ చదివి కిరాణా కొట్టు పెట్టి తనకు ఎదురైన ఇబ్బందుల గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.ఈ నిరుద్యోగి పేరు వెంకట రమణ కాగా ఇతని కిరాణా షాప్ పేరు నిరుద్యోగి కిరాణ జనరల్ స్టోర్స్( Nirudyoga kirana store ) కావడం గమనార్హం.నేను బీటెక్ పూర్తి చేసి కోచింగ్ తీసుకున్నానని జాబ్ రాలేదని ఆయన కామెంట్లు చేశారు.జాబ్ నోటిఫికేషన్లు రాలేదని 300 కంపెనీలు తిరిగానని అర్హతకు తగిన ఉద్యోగం లభించలేదని ఆయన చెప్పుకొచ్చారు.12,000 ,10000 రూపాయలకు జాబ్ చేస్తే లాభం లేదని భావించి సొంతంగా కిరాణా షాప్ పెట్టుకున్నానని వెంకట రమణ అన్నారు.తాను ప్రముఖ యూనివర్సిటీలో డిగ్రీ చేశానని ఆయన వెల్లడించారు.మన రాష్ట్రంలో చాలామంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వెల్లడించారు.నా ఆవేదన ఏపీ ప్రభుత్వానికి తెలియాలని భావించానని వెంకట రమణ అన్నారు.
విడుదలైన అన్ని జాబ్స్ కు నేను దరఖాస్తు చేసుకున్నానని ఒక మార్కు, అర మార్కుతో చాలా జాబ్స్ పోయాయని ఆయన వెల్లడించారు.జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు.ఈ వ్యాపారం ద్వారా రోజుకు 100, 200 వస్తోందని వెంకట రమణ( Venkata Ramana ) చెప్పుకొచ్చారు.
చెల్లికి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాపై ఉందని ఆయన కామెంట్లు చేశారు.వెంకట రమణకు ఏదో ఒకరోజు సక్సెస్ దక్కుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.