నెల్లూరు పట్టణంలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు.అశోక్ నగర్ లో నివాసముంటున్న సునీత, కృష్ణారావును గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
అనంతరం ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దోపిడీ దొంగలు పథకం ప్రకారం హత్య చేసి చోరీకి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది.







