మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్( BRS ) గెలవబోతోందని మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) అన్నారు.కాంగ్రెస్ సర్వే చేసుకుని మెదక్ లో గెలవలేమని నిర్ధారించుకున్నారని తెలిపారు.
వంద రోజుల్లో హామీలు చేస్తామని కాంగ్రెస్ మాట తప్పిందని ఆరోపించారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ చేసిన మోసాలు ప్రజలకు అర్థం అవుతున్నాయని పేర్కొన్నారు.

అందుకే కాంగ్రెస్ ( Congress )గెలిచే అవకాశం లేదన్నారు.అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ రావుకు ఇప్పుడు మెదక్ పార్లమెంట్ లోనూ ఓటమి తప్పదని తెలిపారు.







