2014లో రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజలు బిఆర్‌ఎస్ ( టిఆర్‌ఎస్ ) కు పట్టం కట్టారు.కేంద్రంతో కోట్లాడి రాష్ట్రాన్ని సాధించరనే ఉద్దేశంతో ప్రజలంతా కేసిఆర్ నాయకత్వానికి జై కొట్టి అధికారాన్ని అప్పగించారు.
ఆ తరువాత 2018 ఎన్నికల్లోనూ ప్రజలు కేసిఆర్ వెంటే నడిచారు, మరి ఈసారి ఎన్నికల సంగతేంటి ? అంటే బిఆర్‌ఎస్( BRS PARTY ) గెలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.గత 9 ఏళ్లలో కేసిఆర్ పాలన చూసిన ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారనేది కొందరి అభిప్రాయం.
జిహెచ్‌ఎంసి ఎన్నికలు మొదలుకొని ఆయా నియోజిక వర్గాల్లో జరిగిన ఉప ఎన్నికలను పరిక్షిస్తే ప్రజలు మార్పు కోరుకుతున్నట్లు స్పష్టంగా అర్థమౌతుందనేది కొందరి వాదన.వీటికి బలం చేకూరుస్తూ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది బిఆర్‌ఎస్ ను విడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

మరి బిఆర్‌ఎస్ గెలుపు ఖాయమే అయితే నేతలెందుకు పార్టీ మారుతున్నారనేది ఆలోచించాల్సిన విషయం.ఎన్నికలకు రెండు నెలల ముందే అభ్యర్థుల తొలి జాబితాను బిఆర్‌ఎస్ ప్రకటించినప్పటికి.ఆ పార్టీ వీడే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.మైనంపల్లి హనుమంతరావు( Mynampally Hanumanth Rao ) వంటివారికి సీటు వచ్చిన బిఆర్‌ఎస్ కు గుడ్ బై చెప్పడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయం.
ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది.బిఆర్‌ఎస్ లోని చాలమంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు వంటి వారు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా మరికొంత మంది నేతలు కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు.బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి రమేశ్ ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్,( Rekha Nayak ) బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు వంటి వారు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇలా ఎన్నికల ముందు చాలమంది నేతలు బిఆర్‌ఎస్ ను వీడుతుండడం అనుమానాలకు తావిస్తోంది.ఈసారి బిఆర్‌ఎస్ గెలుపు కష్టమే అని భావించి పార్టీకి గుడ్ బై చెబుతున్నారా ? లేదా కాంగ్రెస్ ఇస్తున్న ఆఫర్ల కారణంగా ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారా అనేది విశ్లేషకులకు సైతం అంతుచిక్కడం లేదు.ఏది ఏమైనప్పటికి బిఆర్‌ఎస్ గెలుపు డౌటే అనే అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.