ఏపీ రాజకీయాల్లో ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్న బారాస పార్టీ ( BRS Party )ఇప్పుడు స్పీడ్ పెంచింది….ముఖ్యం గా ఉత్తరాంధ్రతో పాటు ఉపయోగ గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టిన బారాస పార్టీ అక్కడి కీలక నేతలను పార్టీ లోకి చేర్చుకునే విధం గా పావులు కదుపుతుంది….
విశాఖ వేదికగా మూడు రోజులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆ పార్టీ నిర్వహిస్తుంది.మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన బారాసా ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్( Thota Chandrasekhar ) వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను ఎట్టి పరిస్థితుల లోనూ బారాస పార్టీ అడ్డుకుంటుందంటూ వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో తమ నాయకులు కెసిఆర్ కేటీఆర్( KCR ) స్పష్టతతో ఉన్నారని.ఆంధ్రలో ఉన్న రాజకీయ పార్టీల అలసత్వంతోనే కేంద్రాన్ని ఈ విషయంలో ఒప్పించలేకపోతున్నారని భారాశా పార్టీ ఇది చేసి చూపిస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు ….
మొదటి రోజు కార్యక్రమంలో బాగం గా కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులును కార్యకర్తలను పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు .

రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించిన తోట చంద్రశేఖర్ రెండు జిల్లాల నుంచి తొందర్లోనే తమ పార్టీలోకి వలసలు భారీ స్థాయిలో మొదలవుతాయని.కాపులునే కాకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు .

ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ గాని ఇంతకుముందు అధికారం చేపట్టిన పార్టీ గాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చిత్తశుద్ధితో పనిచేయలేదని.ప్రత్యేక హోదా .పోలవరం ప్రాజెక్ట్,, మెట్రో ప్రాజెక్ట్,, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ( Vizag Steel Plant ) ఇలా రాష్ట్ర అభివృద్ధికి కీలక అంశాలైన వాటిపై రెండు పక్షాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని, తమ పార్టీ వీటిపై పోరాడుతుందని రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని తమను ఆశీర్వదించాలంటూ ఆయన ప్రజల్ని కోరారు మరి ఒక్కసారిగా స్పీడ్ పెంచిన తమపై విమర్శలు చేస్తున్నబారాసా వ్యవహారాలపై ఆంధ్రాలో ఉన్న అధికార ప్రతిపక్షాలు ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి.







