తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు మన పూర్వీకులు.గురువు తరువాతే ఆ దైవం.
మనిషికి విద్య నేర్పిన ప్రత్యక్ష దైవం గురువు.అందుకే ఇక్కడ గురువులు అనబడేవారు ఎంతో గౌరవాన్ని పొందుతూ వుంటారు.
ఎలాంటి మనిషినైనా తమ విద్యాబుద్ధులతో బుద్ధుల్లాగా తయారుచేసే మహానుభావులు వీరు.ఈ క్రమంలో వీరు ఎన్నో త్యాగాల చేస్తూ వుంటారు.
డబ్బులు లేని వైద్యార్థులకు తమ జీతంలో డబ్బుని ఖర్చుచేసి ప్రోత్సహించే గురువులు ఇక్కడ ఎంతోమంది వున్నారు.అయితే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో గురువు( Teacher ) చేసిన త్యాగాన్ని చూస్తే ముక్కున వేలేసుకుంటారు.

ఈ మధ్య కాలంలో ముఖ్యంగా యువకుల్లో జుట్టు సమస్యలు( Hair Problems ) బాగా పెరిగిపోయాయి.నేటి జీవనశైలి, ఉద్యోగ బాధ్యతలు, చదువులు, ఒత్తిడి కారణంగా జుట్టు రాలిపోవడం అనేది సర్వసాధారణ సమస్యగా మారిపోయింది.అయితే నిత్యం కొబ్బరి నూనెను( Coconut Oil ) తలకు రాసుకుంటే ఈ సమస్య తీరుతుంది అని ఆ గురువు భావించాడో ఏమో గాని, తన డబ్బులతో కొబ్బరి నూనెను కొని తన క్లాస్ విద్యార్థులకు తానే స్వయంగా నూనె రాస్తున్నాడు ఓ క్లాస్ టీచర్.ఆ దృశ్యాలనకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

వినడానికి కామెడీగా వున్నా, ఇది నిజమే.కావాలంటే ఇక్కడ వీడియో చూడండి మరి.ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం బట్టతలతో బాధపడుతున్న ఓ టీచర్. తన విద్యార్థులకు ఆ కష్టం రాకూదనే సదుద్దేశంతో ఈ చర్యకు పూనుకున్నట్టుంది.
ఒకరి తర్వాత ఒకరి తలపై తానే కొబ్బరి నూనెను పోస్తూ ‘మీరు రాసుకోండి’ అంటూ క్లాస్‌లోని విద్యార్థులకు ఒక్కొక్కరికీ అందిస్తున్నాడు.ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ మాస్టర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
సరదాసరదా కామెంట్లతో తమ తమ ప్రతిస్పందనలను తెలియజేస్తున్నారు.







