త్వరలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలను( Parliament elections ) దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్( BRS ) వ్యవహాత్మకంగా అడుగులు వేస్తోంది.ముఖ్యంగా తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ను అన్ని విధాలుగా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ రైతులు పంటలు ఎండి, తీవ్ర కష్టాల్లో ఉండడంతో, వారిని ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, కేసిఆర్( KCR ) పరామర్శించారు.ఇక పార్టీ తరఫున రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది ఈ మేరకు రైతు దీక్షలు చేపట్టింది.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు , ఆయా నియోజకవర్గ ఇన్చార్జీలు ఈ రైతు దీక్షలో పాల్గొనబోతున్నారు.
ఉదయం 11 గంటల నుంచి దీక్షలు ప్రారంభం అవుతాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో, హరీష్ రావు( Harish Rao ) సిద్దిపేట దీక్షలో పాల్గొంటారని బీఆర్ఎస్ అధిష్టానం పేర్కొంది.ఎండిన పంటలకు 500 బోనస్ ఇవ్వాలనే డిమాండ్ ను బీఆర్ఎస్ ప్రధానంగా వినిపిస్తోంది.
నిన్న కరీంనగర్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని కెసిఆర్ విమర్శించారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా.
ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, రైతులను అవమానాలకు గురి చేస్తున్నారని కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో 29 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు దీక్షలు( Farmer initiations ) బీఆర్ఎస్ పార్టీ మొదలు పెడుతోంది.
కెసిఆర్ ఇటీవల నిర్వహించిన రైతు పరామర్శ యాత్రలకు జనాల నుంచి బాగా స్పందన వచ్చిందని , అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ రైతు దీక్షలు చేపట్టడం ద్వారా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ మరింతగా పెరుగుతుందని , మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలో పడుతాయనే అంచనా ఆ పార్టీ నేతల్లో ఉంది.