కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi )కి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు.ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోందన్నారు.పార్టీ మారితే సభ్యత్వం రద్దు అని హామీ ఇచ్చిందన్న కేటీఆర్ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే దీనిపై మాట్లాడాలన్నారు.కాంగ్రెస్( Congress ) లో చేరిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సూచించారు.ఇద్దరు ఎమ్మెల్యేలను అనర్హులని ప్రకటించి చెప్పిందే చేస్తామని కాంగ్రెస్ నిరూపించుకోవాలని వెల్లడించారు.